ఈ కామర్స్ రంగం, ఇతర కొరియర్ సంస్థ ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు పోస్టల్ శాఖ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. వాడ వాడలా, పల్లె పల్లెనా తన సేవలు విస్తరించేందుకు వినియోగదారులకు వేగంగా వస్తువులు చేరవేసేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. ఇది విద్యార్థులు, నిరుద్యోగులు, చిరు ఉద్యోగులకు, గృహిణులకు ఒక మంచి అవకాశం అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ 2.0 ఆధునిక పారదర్శక సేవలతో ఉపాధి అవకాశాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం. స్పీడ్ పోస్ట్, డాక్యుమెంట్ బుకింగ్, పార్సిల్ బుకింగ్ ,ఇంటర్నేషనల్ బుకింగ్ పికప్ సేవలు, కాష్ ఆన్ డెలివరీ, ఇంటి నుంచి పార్సెల్ సేకరణ ..ఇలా రకరకాల సేవలు అందించవచ్చు. ఫ్రాన్సిసింగ్ గారు తమ అవకాశాన్ని బట్టి బుకింగ్ మాత్రమే, డెలివరీ మాత్రమే, పికప్ మాత్రమే, అన్ని సేవలు కలిపి ..అనే నాలుగు రకాల సేవలు ఎంచుకోవచ్చు .డెలివరీ సేవలు కోసం వాహనం ఉంటే సరిపోతుంది. బుకింగ్ సేవలకు చిన్న స్థలం స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్, ఇంటర్నెట్ ప్రింటర్ సదుపాయాలు ఉండాలి. అర్హతలు కనీస వయసు… 18 సంవత్సరాలు బుకింగ్ సేవలకు… ఇంటర్ ఉత్తీర్ణత డెలివరీ సేవలకు.. టెన్త్ పాస...